Sonakshi Sinha | సోనాక్షి పెళ్లి ఏ పద్ధతిలో జరుగుతుంది?

 

2024-06-23 03:50:47.0

https://www.teluguglobal.com/h-upload/2024/06/23/1338592-sonakshi.webp

Sonakshi Wedding – ఈరోజు జహీర్ ఇక్బాల్ ను పెళ్లాడబోతోంది సోనాక్షి సిన్హా. మరి ఆమె పెళ్లి ఏ పద్ధతిలో జరుగుతుంది?

హీరోయిన్ సోనాక్షి సిన్హా, తన బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ను పెళ్లాడబోతోంది. ముంబయిలో ఈరోజు పెళ్లి వేడుక అట్టహాసంగాజరగబోతోంది. మరి సోనాక్షి పెళ్లి వేడుక ఏ పద్ధతిలో జరుగుతుంది. హిందూ సంప్రదాయంలో జరుగుతుందా లేక ముస్లిం పద్ధతిలో జరుగుతుందా?

ఇలాంటి సందర్భాల్లో సెలబ్రిటీలంతా రెండు పద్ధతుల్లో పెళ్లిళ్లు చేసుకోవడం మనం చూశాం. రెండు వర్గాలకు చెందినప్పుడు రెండు సంప్రదాయాల్లో పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. కానీ సోనాక్షి పెళ్లి మాత్రం అలా జరగడం లేదు.

ఇటు హిందు సంప్రదాయం, అటు ముస్లిం సంప్రదాయనికి దూరంగా.. పౌర వివాహం చేసుకుంటారట వీళ్లు. ఈ విషయాన్ని జహీర్ ఇక్బాల్ తండ్రి స్పష్టం చేశారు. ఇక్బాల్ ఇంటిలోనే అధికారుల సమక్షంలో రిజిస్టర్ లో వీళ్లు అధికారికంగా సంతకాలు చేస్తారంట. అంటే వీళ్లది రిజిస్టర్ మ్యారేజ్ అన్నమాట.

పెళ్లి తర్వాత సోనాక్షి, ఇస్లాం స్వీకరిస్తుందనే పుకార్లను ఇక్బాల్ కుటుంబీకులు తోసిపుచ్చుతున్నారు. ఎవరి మతాల్ని వాళ్లు గౌరవిస్తూ కలిసి జీవిస్తారని, మనసులు కలిసిన తర్వాత మతాలతో సంబంధం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.

అందరు తారల్లా కాకుండా సోనాక్షి-ఇక్బాల్ సింపుల్ గా పెళ్లి చేసుకుంటున్నారు. ఈ ఒక్క రోజుతో వాళ్ల పెళ్లి వేడుక ముగియబోతోంది. 

 

Sonakshi Sinha,Sonakshi wedding,Jahir Iqbal