Sreshth Movies | నితిన్ బ్యానర్ లో మరో క్రేజీ మూవీ

 

2024-08-24 17:11:34.0

https://www.teluguglobal.com/h-upload/2024/02/17/1298825-shiva-karthikeyan-amaran.webp

Sreshth Movies – కమల్ హాసన్ నిర్మాతగా, శివకార్తికేయన్ నటిస్తున్న అమరన్ మూవీ తెలుగు హక్కుల్ని శ్రేష్ఠ్ మూవీస్ దక్కించుకుంది.

ప్రిన్స్ శివకార్తికేయన్ ద్విబాషా యాక్షన్ చిత్రం అమరన్. ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి రచన, దర్శకత్వం వహించారు, కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ దీపావళి అక్టోబర్ 31న చిత్రం థియేటర్‌లలో విడుదలకు సిద్ధంగా ఉంది.

హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అతని సోదరి నిఖితారెడ్డి ఈ సినిమా ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సెన్సేషనల్ హిట్ విక్రమ్ మూవీ తర్వాత కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్‌తో శ్రేష్ట్ మూవీస్‌కి ఇది రెండవ చిత్రం కావడం విశేషం.

విక్రమ్ చిత్రం సమయంలో చేసిన ప్రమోషన్లు, భారీ విడుదల కోసం సుధాకర్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని కమల్ హాసన్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఇప్పుడు అమరన్ సినిమా కూడా శ్రేష్ట్ మూవీస్ చేతికి వెళ్లడంతో కమల్ ఆనందం వ్యక్తం చేయడంతో పాటు, కాస్త సెంటిమెంట్ కూడా ఫీలయ్యారు. విక్రమ్ తరహాలో అమరన్ కూడా హిట్ అవుతుందనే సెంటిమెంట్ ను వ్యక్తం చేశారు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అమరన్‌లో శివకార్తికేయన్ మునుపెన్నడూ చూడని సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడు. ఆయన సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ‘ఇండియాస్ మోస్ట్’ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

 

Sreshth Movies,Amaran Movie,telugu rights,Sudhakar Reddy