Srikanth Odela | సర్టిఫికెట్లు కాల్చేశాడు

 

2024-08-26 04:52:38.0

https://www.teluguglobal.com/h-upload/2024/08/26/1354761-srikanth-odela.webp

Srikanth Odela – శ్రీకాంత్ ఓదెల తన సర్టిఫికెట్లు మొత్తం తగలబెట్టేశాడు. అతడు ఎందుకిలా చేశాడు?

సినిమా పిచ్చి అనే పదబంధం ఊరికే పుట్టలేదు. ఒక్కసారి అది మెదడులోకి ఎక్కిందంటే, ఇక ఆ పిచ్చిని వదిలించడం చాలా కష్టం. సదరు వ్యక్తిని ఆ రంగం నుంచి మరోవైపు మళ్లించడం దాదాపు అసాధ్యం. దీనికి మరో సాలిడ్ ఎగ్జాంపుల్ గా నిలిచాడు దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.

సినీ రంగంవైపు వెళ్లకుండా తనను అడ్డుకుంటారేమో అనే ఉద్దేశంతో, ఇతడు తన సర్టిఫికెట్లు కాల్చేశాడు. ఈ విషయాన్ని ఓదెల స్వయంగా వెల్లడించాడు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్ లో జాయిన్ చేయాలని చూశారట శ్రీకాంత్ తల్లిదండ్రులు. అందుకే కావాలనే ఇంటర్మీడియట్ తప్పాడంట.

అయితే ఫిలిం స్కూల్ లో అడ్మిషన్ కావాలంటే ఇంటర్ పాసవ్వాలనే రూల్ ఉండడంతో మళ్లీ ఇంటర్మీడియట్ పాసయ్యాడట. కానీ ఫిలింస్కూల్ లో సీటు రాలేదంట. దీంతో తనను ఎక్కడ మళ్లీ ఇంజనీరింగ్ వైపు మళ్లిస్తారో అని భయపడి తన సర్టిఫికేట్లు అన్నింటినీ కాల్చేశాడంట ఈ దర్శకుడు.

అలా కసితో సినీ రంగంలోకి అడుగుపెట్టిన శ్రీకాంత్.. దసరా సినిమాతో దర్శకుడయ్యాడు. హిట్ కొట్టాడు. ఇప్పుడు తన రెండో సినిమాను కూడా నానితోనే తీస్తున్నాడు. 

 

Srikanth Odela,Srikanth Odela certificates,Dasara Movie