2024-04-23 17:34:31.0
https://www.teluguglobal.com/h-upload/2024/04/23/1321663-sundeep-kishan-1.webp
Sundeep Kishan, Trinadha Rao Nakkina Movie – త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ చేయబోయే సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది.
‘ఊరు పేరు భైరవకోన’ విజయాన్ని ఆస్వాదిస్తున్న హీరో సందీప్ కిషన్ తన ల్యాండ్‌మార్క్ 30వ చిత్రం కోసం ధమాకా దర్శకుడు త్రినాధ రావు నక్కినతో చేతులు కలిపాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై వస్తున్న సినిమా ఇది.
పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర సమర్పిస్తున్నారు.
ఈ రోజు, ఈ సినిమా గ్రాండ్‌గా ప్రారంభమైయింది. ముహూర్తం కార్యక్రమానికి విజయ్ కనకమేడల కెమెరా స్విచాన్ చేయగా, దిల్ రాజు క్లాప్ కొట్టారు. అనిల్ సుంకర తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు.
త్రినాధరావు నక్కిన విజయవంతమైన ప్రయాణంలో భాగమైన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ.. ఈ సినిమాకు కూడా కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్స్ అందిస్తున్నాడు. ధమాకా తర్వాత త్రినాధరావు నుంచి వస్తున్న సినిమా ఇదే.
సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ గత చిత్రాల కంటే డిఫరెంట్ గా ఉంటుంది. రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడు.
Sundeep Kishan,Trinadha Rao Nakkina,New Movie,Anil Sunkara