https://www.teluguglobal.com/h-upload/2023/05/09/500x300_760160-march-of-suvs-continues-in-april-nexon-creta-brezza-shine.webp
2023-05-09 08:23:39.0
SUV Car Sales | 2023 ఏప్రిల్‌లో1.57 లక్షలకు పైగా ఎస్‌యూవీ కార్లను కార్ల తయారీ సంస్థలు తమ డీలర్లకు పంపిణీ చేశాయి. ఇది మొత్తం ఎస్‌యూవీల మార్కెట్‌లో 47 శాతానికి పై చిలుకు.
SUV Car Sales | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులోనూ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ)ల పట్ల మోజు పెంచుకుంటున్నారు. కార్ల తయారీలో వినియోగించే సెమీ కండక్టర్ల సరఫరా మెరుగు కావడంతో గత నెలలో ఎస్‌యూవీ కార్ల సేల్స్‌లో వృద్ధి నమోదైంది. 2022తో పోలిస్తే గత నెలలో ఎస్‌యూవీ కార్ల సేల్స్‌లో 13 శాతం గ్రోత్ నమోదైంది. 2022 ఏప్రిల్‌లో 2,93,821 ఎస్‌యూవీ కార్ల విక్రయాలు జరిగితే.. గత నెలలో 3,31,747 కార్లు అమ్ముడు పోయాయి.
2023 ఏప్రిల్‌లో1.57 లక్షలకు పైగా ఎస్‌యూవీ కార్లను కార్ల తయారీ సంస్థలు తమ డీలర్లకు పంపిణీ చేశాయి. ఇది మొత్తం ఎస్‌యూవీల మార్కెట్‌లో 47 శాతానికి పై చిలుకు. గత నెల మొత్తం కార్ల విక్రయాల్లో 43 శాతం ఎస్‌యూవీ సెగ్మెంట్‌దే. టాటా మోటార్స్ వారి నెక్సాన్ (Tata Nexon), హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta), మారుతి సుజుకి బ్రెజా (Maruti Suzuki Brezza), టాటా మోటార్ పంచ్ (Tata Punch), హ్యుండాయ్ వెన్యూ (Hyundai Venue) వంటి ఎస్‌యూవీ కార్లు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌గా నిలిచాయి. మున్ముందు మొత్తం కార్ల విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా 48-49 శాతానికి పెరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.
గత నెలలో ఓవరాల్‌గా అత్యధికంగా అమ్ముడైన కార్లలో మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ నిలిచింది. అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ కారుగా టాటా నెక్సాన్ మొదటి స్థానంలో ఉంది. గత నెలలో టాటా నెక్సాన్ రికార్డు స్థాయిలో 15,002 యూనిట్ల కార్లు అమ్ముడైతే తర్వాతీ స్థానాల్లో హ్యుండాయ్ క్రెటా (14,186), మారుతి సుజుకి బ్రెజా (11,836) నిలిచాయి.
టాటా పంచ్ సేల్స్ పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. గత నెలలో 10,934 యూనిట్ల పంచ్ కార్లు అమ్ముడైతే, తర్వాతీ స్థానంలో హ్యుండాయ్ వెన్యూ 10,342 కార్లు అమ్ముడయ్యాయి.
ఏప్రిల్‌లో టాప్ సెల్లింగ్ ఎస్‌యూవీ కార్లు:
♦ టాటా నెక్సాన్ – 15,002 యూనిట్లు
♦ హ్యుండాయ్ క్రెటా – 14,186 యూనిట్లు
♦ మారుతి సుజుకి బ్రెజా – 11,836 యూనిట్లు
♦ టాటా పంచ్ – 10,934 యూనిట్లు
♦ హ్యుండాయ్ వెన్యూ – 10,342 యూనిట్లు
SUV Car Sales,April 2023,Tata Nexon,Maruti Wagon-R,Business News,Automobile News
SUV Car Sales, April 2023, Tata Nexon, Maruti Wagon-R, Business News, Automobile News
https://www.teluguglobal.com//business/march-of-suvs-continues-in-april-nexon-creta-brezza-shine-931992