https://www.teluguglobal.com/h-upload/2023/07/07/500x300_792589-swiggy-credit-card.webp
2023-07-08 00:56:43.0
Swiggy Credit card | పేటీఎం, మైంత్రా, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు జారీ చేశాయి.. ఆ బాటలోనే పాపులర్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ `స్విగ్గీ (Swiggy)` పయనిస్తున్నది.
Swiggy Credit card | గతంతో పోలిస్తే ఇప్పుడు క్రెడిట్ కార్డు (credit card) ల వాడకం పెరిగిపోయింది. పలు బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలు.. చమురు సంస్థలు.. ఈ-కామర్స్ సంస్థలు.. ఫిన్‌టెక్ కంపెనీలు.. ఎలక్ట్రానిక్స్ సంస్థలూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు (co-branded credit card) జారీ చేస్తున్నాయి. వీటితో యూజర్లతోపాటు సంబంధిత సంస్థలు బెనిఫిట్లు పొందుతున్నాయి.. ఆదాయం అందుకుంటున్నాయి. పేటీఎం, మైంత్రా, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు జారీ చేశాయి.. ఆ బాటలోనే పాపులర్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ `స్విగ్గీ (Swiggy)` పయనిస్తున్నది.
ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (HDFC Bank) తో కలిసి `స్విగ్గీ`.. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు (co-branded credit card) జారీ చేయనున్నది. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు జారీ చేయడానికి వివిధ ఫిన్‌టెక్ కంపెనీలు, బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నది. మరో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ `జొమాటో` ఈ ఏడాది ప్రారంభంలో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు (co-branded credit card) మార్కెట్ నుంచి వైదొలిగింది. ఆర్బీఎల్ బ్యాంకుతో కలిసి 2020లోనే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు జారీ చేసిన జొమాటో ఇటీవలే ఆ బిజినెస్ నుంచి ఉపసంహరించుకున్నది.
ఇక `స్విగ్గీ` సొంతంగా కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు జారీ చేస్తుండటం ఆసక్తికర పరిణామం. త్వరలో రానున్న స్విగ్గీ క్రెడిట్ కార్డు సేవలపై ఆకర్షణీయ డిస్కౌంట్లు, స్పెషల్ ఆఫర్లు లభిస్తాయని భావిస్తున్నారు. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుతో స్విగ్గీకి అదనపు రెవెన్యూ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతోపాటు క్రెడిట్ కార్డు నెట్‌వర్క్ `మాస్టర్ కార్డ్` పార్టనర్‌గా నిలుస్తుందని తెలుస్తున్నది. వీటితోపాటు ఫుడ్-టెక్ కంపెనీ `స్విగ్గీ` ఆధారిత క్రెడిట్ కార్డుతోపాటు అదనంగా డైనౌట్ (రెస్టారెంట్ల బిల్లు చెల్లింపుల)తో అదనపు డిస్కౌంట్లు అందుకోవచ్చు. త్వరలో స్విగ్గీ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు మార్కెట్‌లోకి రానున్నదని తెలుస్తున్నది.
Swiggy Credit card,Swiggy,Credit card,HDFC Bank
Swiggy Credit card, Credit card, Swiggy Credit card, HDFC Bank, Co-branded credit card, Mastercard, క్రెడిట్ కార్డులు, పేటీఎం, మైంత్రా, ఫ్లిప్‌కార్ట్, ఫుడ్ డెలివరీ, స్విగ్గీ
https://www.teluguglobal.com//business/swiggy-pilot-testing-co-branded-credit-card-with-hdfc-bank-mastercard-946193