Talvar Movie | ఆకాష్ కొత్త సినిమా టైటిల్ ఇదే

 

2024-08-19 15:34:01.0

https://www.teluguglobal.com/h-upload/2024/08/19/1353338-akash.webp

Akash Jagannadh Talvar – ఆకాష్ పూరి పేరు మార్చుకున్నాడు. ఆకాష్ జగన్నాధ్ అయ్యాడు. పేరు మార్చుకున్న తర్వాత అతడు చేస్తున్న తొలి సినిమా తల్వార్.

యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ కొత్త సినిమా మొదలైంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు “తల్వార్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పై భాస్కర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. కొత్త దర్శకుడు కాశీ పరశురామ్ దర్శకుడు.

ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన తల్వార్ సినిమా ప్రారంభోత్సవంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, హీరో కార్తికేయ స్క్రిప్ట్ హ్యాండోవర్ చేశారు.

డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ చిత్రంలో భారీ తారాగణం నటించబోతున్నారు. హీరోయిన్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుల వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు. కేశవ కిరణ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

 

Akash Jagannadh,Akash Jagannadh Movie,Talvar Movie