https://www.teluguglobal.com/h-upload/2023/06/14/500x300_781956-tata-altroz.webp
2023-06-14 12:10:48.0
Tata Altroz | దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ఆల్ట్రోజ్ సీఎన్జీ (Altroz iCNG) వేరియంట్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
Tata Altroz | దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ఆల్ట్రోజ్ సీఎన్జీ (Altroz iCNG) వేరియంట్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. దీని ధర రూ.7.55 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ట్విన్ సిలిండర్‌తో వస్తున్న తొలి సీఎన్జీ టెక్నాలజీ కారు ఇది. బూట్ స్పేస్‌తో రాజీ పడకుండా ట్విన్ సిలిండర్ క్విట్ అమర్చారు. సీఎన్జీ వర్షన్లో టియాగో, టైగోర్ మోడల్స్ విజయవంతం కావడంతో ఆల్ట్రోజ్ మోడల్ (Altroz iCNG) కారును తీసుకొచ్చింది.

ఆల్ట్రోజ్ సీఎన్జీ
ఎక్స్ఈ (XE), ఎక్స్ఎం + (XM+), ఎక్స్ఎం + (ఎస్) XM+(S), ఎక్స్‌జడ్ (XZ), ఎక్స్‌జడ్ + (ఎస్) (XZ+(S)), ఎక్స్‌జడ్ + ఓ (ఎస్) (XZ+O(S) వేరియంట్లలో ఆల్ట్రోజ్ సీఎన్జీ వర్షన్ కారు వస్తుంది. ఇది నాలుగు కలర్ ఆప్షన్స్- ఒపెరా బ్లూ, డౌన్‌టౌన్ రెడ్, ఆర్కేడ్ గ్రే, ఎవెన్యూ వైట్ ల్లో లభిస్తుంది. మూడేండ్లు లేదా లక్ష కి.మీ. స్టాండర్డ్ వారంటీ అందిస్తున్నది టాటా మోటార్స్.
వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్లెస్ చార్జర్, ఎయిర్ ఫ్యూరిఫయర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 8-స్పీకర్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ బై హార్మన్ విత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
ఆల్ట్రోజ్ కారు అల్ఫా (ఏజిల్, లైట్, ఫ్లెక్సిబుల్ అండ్ అడ్వాన్స్డ్) ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్నది. రీఫ్యూయలింగ్ వేళ సేఫ్టీ కోసం మైక్రో స్విచ్ ఆఫ్ అవుతుంది. ఐ-సీఎన్జీ ఆల్ట్రోజ్ కారు ఇంజిన 1.2 లీటర్ల రెవోట్రాన్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 6000 ఆర్పీఎం వద్ద 73.5 పీఎస్ విద్యుత్, 3500 ఆర్పీఎం వద్ద 103 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. మార్కెట్లోకి వచ్చిన 18 నెలల్లోనే టాటా ఆల్ట్రోజ్ 50 లక్షల కార్లు విక్రయించి రికార్డు సాధించింది. 2019-20లో మార్కెట్లో 4.75 శాతంగా ఉన్న టాటా మోటార్స్ షేర్ 2023-24 13.88 శాతానికి దూసుకెళ్లింది.

ఆల్ట్రోజ్‌పై డిస్కౌంట్లు.. పరిమిత ఆఫర్
తన కస్టమర్లను ఆకర్షించడానికి టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఆల్ట్రోజ్ మీద భారీగా ఆఫర్లు అందిస్తున్నది. క్యాష్ డిస్కౌంట్ రూ.15,000, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.2000 లభిస్తుంది. 13 వేరియంట్లలో అందుబాటులో ఉన్న టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ వేరియంట్ కూడా మార్కెట్లో లభిస్తుంది. అంతే కాదు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో మార్కెట్లో లభిస్తున్న తొలి సీఎన్జీ కారు టాటా ఆల్ట్రోజ్.
Tata Altroz,Discounts,Tata Motors,Altroz iCNG
Tata Altroz, Tata Altroz on road Price Bangalore, tata altroz discount offer, tata altroz sale, tata altroz service cost, Tata Motors, telugu news, telugu global news, Altroz iCNG, ఆటోమొబైల్, టాటా మోటార్స్, ఆల్ట్రోజ్ సీఎన్జీ, హైదరాబాద్, హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు
https://www.teluguglobal.com//business/tata-altroz-gets-discounts-of-up-to-rs-28000-in-june-2023-940250