https://www.teluguglobal.com/h-upload/2023/06/19/500x300_784573-tata-cars.webp
2023-06-19 03:00:59.0
Tata Motors Discounts | టియాగో, టైగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ వంటి మోడల్స్‌తో `న్యూ ఫర్ ఎవర్` రేంజ్ మోడల్ కార్లను మార్కెట్లోకి తెచ్చింది.
Tata Motors Discounts | దేశీయంగా కార్ల తయారీలోనూ, మార్కెటింగ్‌లోనూ మారుతి సుజుకిదే అగ్ర తాంబూలం.. ఆ తర్వాత స్థానంలో ఉన్న హ్యుండాయ్ మోటార్స్‌ను ఆలస్యంగానైనా.. నువ్వా నేనా అన్నట్లు డీ కొట్టేందుకు సిద్ధమైంది దేశీయ ఆటోమొబైల్స్ సంస్థ టాటా మోటార్స్. టియాగో, టైగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ వంటి మోడల్స్‌తో `న్యూ ఫర్ ఎవర్` రేంజ్ మోడల్ కార్లను మార్కెట్లోకి తెచ్చింది.
ప్రతి త్రైమాసికంలోనూ మార్కెట్‌లో తన వాటాను పెంచుకుంటూ దూసుకెళ్తున్నది టాటా మోటార్స్. మరింతగా తన వాటా పెంచుకునేందుకు జూన్‌లో తన కార్లపై గణనీయ డిస్కౌంట్లు అందిస్తున్నది. టాప్ సెల్లింగ్ మోడల్స్ పంచ్, నెక్సాన్ మినహా అన్ని మోడల్ కార్లపై కస్టమర్లకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు, కస్టమర్ ఆఫర్లు ప్రకటించింది. అవేమిటో తెలుసుకుందామా..!
టియాగోపై రూ.40 వేల వరకూ డిస్కౌంట్లు
టాటా టియాగో పెట్రోల్ వేరియంట్ గరిష్టంగా రూ.30 వేల డిస్కౌంట్లు ప్రకటించింది. కస్టమర్ స్కీం కింద రూ.20 వేలు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూపంలో రూ.10 వేల రాయితీ ఇస్తున్నది. టియాగో సీఎన్జీ వేరియంట్ గరిష్టంగా కన్జూమర్ స్కీం కింద రూ.30,000, ఎక్స్చేంజ్ రూ. 10,000 కలిపి మొత్తం డిస్కౌంట్ రూ.40 వేలు ఆఫర్ చేస్తున్నది.

టాటా టియాగో
టైగోర్‌పై ఇవీ డిస్కౌంట్లు
టాటా టైగోర్ పెట్రోల్ వేరియంట్‌పై రూ.30,000, సీఎన్జీ వేరియంట్‌పై గరిష్టంగా రూ.45,000 రాయితీ ఇస్తున్నది. రెండు కార్లపై ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.10 వేలు అందిస్తున్నది. సీఎన్జీ టైగోర్ వేరియంట్ మీద రూ.35,000, పెట్రోల్ వేరియంట్‌పై రూ.20 వేల కన్జూమర్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నది.

టాటా టైగోర్
హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌పై ఇలా
టాటా మోటార్స్ తన హ్యాచ్‌బ్యాక్ కారు ఆల్ట్రోజ్ మీద మొత్తం రూ.25,000 డిస్కౌంట్లు ఆఫర్ చేసింది. కన్జూమర్ డిస్కౌంట్ రూ.15,000, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.10,000 అందిస్తున్నది. పెట్రోల్, డీజిల్ వర్షన్లపై డిస్కౌంట్‌లు సమానంగా అందిస్తామని తెలిపింది.

ఆల్ట్రోజ్
హారియర్.. సఫారీలపై రూ.25 వేల డిస్కౌంట్లు
టాటా మోటార్స్ ఫ్లాగ్‌షిప్ మోడల్ కారు సఫారీపై ఎక్స్చేంజ్ ఆఫర్ రూపంలో రూ.25,000 డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే హారియర్ మీద కూడా రూ.25,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అందజేస్తున్నది.

హారియర్
Tata Tiago,Tata Tigor,Tata Altroz,Tata Motors,Discounts,Tata Motors Discounts
Tiago, Tigor, Altroz, Harrier, Safari, Tata Altroz, Tata Motors, Tata Motors Discounts, June discounts on Tata cars, టియాగో, టైగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ
https://www.teluguglobal.com//business/tiago-tigor-altroz-harrier-safari-check-out-june-discounts-on-tata-cars-here-941396