Tata Nexon 2023 | మీట‌ర్‌-4 స‌బ్ కంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ లీడ‌ర్‌గా టాటా నెక్సాన్‌.. మారుతి బ్రెజా, హ్యుండాయ్ వెన్యూ త‌ర్వాతే..

https://www.teluguglobal.com/h-upload/2023/11/09/500x300_853784-tata-nexon.webp
2023-11-09 11:02:41.0

ఎస్‌యూవీ కార్ల‌లోనూ స‌బ్‌-4 మీట‌ర్ కంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కార్ల త‌యారీ సంస్థ‌లు ఒక దాంతో మ‌రొక‌టి పోటీ ప‌డుతున్నాయి.

Tata Nexon 2023 | గ‌తంలో ఫ‌స్ట్‌టైం కార్లు కొనుగోలు చేయాల‌నుకున్న వారు బుల్లి, ఎంట్రీ లెవ‌ల్ కార్లకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కాల క్ర‌మేణా హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్ల వైపు మ‌ళ్లారు. క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న వారి అభిరుచులు మారిపోయాయి. గ‌త నాలుగేండ్ల‌లో రోజురోజుకు ఎస్‌యూవీ కార్ల సేల్స్ పుంజుకుంటున్నాయి. ప్ర‌స్తుతం కార్ల మార్కెట్లో ప్ర‌తి రెండు కార్ల విక్ర‌యాల్లో ఒక‌టి ఎస్‌యూవీ ఉంటున్న‌ది.

ఎస్‌యూవీ కార్ల‌లోనూ స‌బ్‌-4 మీట‌ర్ కంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కార్ల త‌యారీ సంస్థ‌లు ఒక దాంతో మ‌రొక‌టి పోటీ ప‌డుతున్నాయి. కార్ల మార్కెట్లో అతిపెద్ద సంస్థ‌లు మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ ఇండియాతో టాటా మోటార్స్ ట‌ఫ్ ఫైట్ ఇస్తున్న‌ది. మారుతి సుజుకి బ్రెజా (Maruti Suzuki Brezza), హ్యుండాయ్ వెన్యూ (Hyundai Venue)ల‌తో పోలిస్తే ఇటీవ‌లే మార్కెట్లోకి ఎంట‌రైన న్యూ టాటా నెక్సాన్ (Tata Nexon) సేల్స్ పెరిగాయి. సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్ నెల‌ల్లో స‌బ్‌-4 మీట‌ర్ కంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ లీడ‌ర్‌గా నిలిచింది. ఈ నేప‌థ్యంలో దేశంలో అమ్ముడ‌వుతున్న ఐదు ప్ర‌ధాన స‌బ్‌-4 మీట‌ర్ కంపాక్ట్ ఎస్‌యూవీల గురించి తెలుసుకుందామా..!

టాటా నెక్సాన్ ఇలా

ఇటీవ‌లే మార్కెట్లోకి ప్ర‌వేశించిన న్యూ టాటా నెక్సాన్ (Tata Nexon) గ‌త నెల‌లో బెస్ట్ సెల్లింగ్ స‌బ్‌-4 మీట‌ర్ కంపాక్ట్ ఎస్‌యూవీగా నిలిచింది. అక్టోబ‌ర్‌లో 16,887 యూనిట్లు అమ్ముడ‌య్యాయి. సెప్టెంబ‌ర్‌లోనూ 15,325 యూనిట్ల టాటానెక్సాన్ కార్లు అమ్ముడ‌య్యాయి. 2023 టాటా నెక్సాన్ (Tata Nexon) కారు ధ‌ర రూ.8.10 ల‌క్ష‌ల నుంచి రూ.15.50 ల‌క్ష‌ల మ‌ధ్య (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతున్న‌ది.

రెండో స్థానానికి మారుతి బ్రెజా

మారుతి సుజుకి (Maruti Suzuki) స‌బ్‌-4 మీట‌ర్ కంపాక్ట్ ఎస్‌యూవీ మోడ‌ల్ మారుతి బ్రెజా (Maruti Suzuki Brezza) గ‌త నెల‌లో16,050 యూనిట్లు విక్ర‌యించింది. దేశీయ కార్ల మార్కెట్ల‌లో అమ్ముడ‌వుతున్న బెస్ట్ ఎస్‌యూవీ మోడ‌ల్ ఇది. దీని ధ‌ర రూ.8.29 – రూ.14.14 ల‌క్ష‌ల మ‌ధ్య (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతున్న‌ది.

హ్యుండాయ్ వెన్యూ ఇలా

ద‌క్షిణ కొరియా ఆటోమేజ‌ర్ హ్యుండాయ్ మోటార్స్‌కు చెందిన వెన్యూ మంచి పెర్పార్మెన్స్ చూపుతోంది. టాటా నెక్సాన్‌, మారుతి బ్రెజా త‌ర్వాత స్థానం హ్యుండాయ్ వెన్యూదే. గ‌త నెల‌లో భార‌త్ మార్కెట్లో హ్యుండాయ్ వెన్యూ (Hyundai Venue) 11,581 యూనిట్లు విక్ర‌యించింది. భార‌త్‌లో హ్యుండాయ్ వెన్యూ ధ‌ర రూ.7.89 ల‌క్ష‌ల నుంచి రూ.13.90 ల‌క్ష‌ల మ‌ధ్య (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది. ఇందులో వెన్యూ ఎన్‌-లైన్ (Venue N-Line) మోడ‌ల్ సేల్స్ కూడా క‌లిసి ఉన్నాయి.

ఇలా మారుతి సుజుకి ఫ్రాంక్స్‌

ఇటీవ‌లే మార్కెట్లోకి విడుద‌ల చేసిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) బాగానే క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తోంది. గ‌త నెల‌లో 11,357 యూనిట్ల మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) కార్లు అమ్ముడ‌య్యాయి. ఈ కారు ధ‌ర రూ.7.46 ల‌క్ష‌ల నుంచి రూ.13.13 ల‌క్ష‌ల మ‌ధ్య (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది.

బోలెరో.. బోలెరో నియో కూడా బెట‌ర్ సేల్స్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా సైతం స‌బ్‌-4 మీట‌ర్ కంపాక్ట్ ఎస్‌యూవీ కార్ల విక్ర‌యాల్లో మిగ‌తా సంస్థ‌ల‌తో పోటీ ప‌డుతోంది. మ‌హీంద్రా బోలెరో నియో (Mahindra Bolero Neo) తో క‌లిసి మ‌హీంద్రా బోలెరో (Mahindra Bolero) గ‌త నెల‌లో 9,647 యూనిట్లు విక్ర‌యించింది. ఈ కారు ధ‌ర రూ.9.79 ల‌క్ష‌ల నుంచి రూ.12.15 ల‌క్ష‌ల మ‌ధ్య (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతోంది.

Tata Nexon,SUV,Maruti Suzuki,Maruti Suzuki Brezza,Hyundai Venue,Hyundai
Tata Nexon, Tata Nexon 2023, SUV, SUV cars, SUV cars news telugu, telugu news, telugu global news, Maruti Suzuki, Brezza, Hyundai Venue, Hyundai

https://www.teluguglobal.com//business/new-tata-nexon-takes-compact-suv-segment-by-storm-races-ahead-of-maruti-suzuki-brezza-hyundai-venue-973203