Tecno Camon 30 Premier 5G | పోలార్ ఏస్ ఇమేజింగ్ సిస్ట‌మ్‌తో టెక్నో కామోన్‌30 ప్రీమియ‌ర్ 5జీ ఫోన్‌.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

2024-04-18 09:16:21.0

Tecno Camon 30 Premier 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ టెక్నో (Tecno) త‌న టెక్నో క‌మోన్30 ప్రీమియ‌ర్ 5జీ (Tecno Camon 30 Premier 5G) ఫోన్‌ను గ్లోబ‌ల్ మార్కెట్లో బుధవారం ఆవిష్క‌రించింది.

Tecno Camon 30 Premier 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ టెక్నో (Tecno) త‌న టెక్నో క‌మోన్30 ప్రీమియ‌ర్ 5జీ (Tecno Camon 30 Premier 5G) ఫోన్‌ను గ్లోబ‌ల్ మార్కెట్లో బుధవారం ఆవిష్క‌రించింది. గ‌త ఫిబ్ర‌వ‌రిలో తొలిసారి బార్సిలోనాలో జ‌రిగిన మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ (ఎండ‌బ్ల్యూసీ) 2024లో ఈ ఫోన్‌ను ప్ర‌ద‌ర్శించింది టెక్నో (Tecno). ఈ ఫోన్‌లో పొలార్ఏస్ ఇమేజింగ్ సిస్ట‌మ్ (PolarAce Imaging System) ఉంటుంది. పొలార్ ఏస్ ఇమేజింగ్ సిస్ట‌మ్‌లో ఇండిపెండెంట్ ఇమేజింగ్ చిప్ (independent imaging chip), ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్‌తో ఈ ఫోన్ వ‌స్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్వోసీ చిప్‌సెట్ (MediaTek Dimensity 8200 SoC)తో వ‌స్తోంది. డోల్బీ ఆట్మోస్ మ‌ద్ద‌తుతో డ్యుయ‌ల్ స్పీక‌ర్స్ ఉంటాయి. వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీతో అందుబాటులోకి వ‌స్తున్న‌ది. భార‌త్ మార్కెట్లో టెక్నో క‌మోన్30 ప్రీమియ‌ర్ 5జీ ఫోన్ ఎప్పుడు ఆవిష్క‌రిస్తార‌న్న సంగ‌తి వెల్ల‌డించ‌లేదు.

కానీ ఇంకా టెక్నో క‌మోన్30 ప్రీమియ‌ర్ 5జీ (Tecno Camon 30 Premier 5G) ఫోన్ ధ‌ర బ‌య‌ట పెట్ట‌లేదు. టెక్నో గ్లోబ‌ల్ వెబ్‌సైట్ లిస్ట్‌లో 12 జీబీ ర్యామ్ విత్ ఆన్ బోర్డు 512 జీబీ స్టోరేజీ కెపాసిటీ క‌లిగి ఉంట‌ది. రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్లు ఆల్పీస్ స్నోనీ సిల్వ‌ర్‌, హ‌వాయి లావా బ్లాక్ రంగుల‌లో ఈ ఫోన్ ల‌భిస్తుంది. దేశాల వారీగా ధ‌ర‌లు వెల్ల‌డిస్తుంద‌ని తెలుస్తున్న‌ది. వ‌చ్చేనెల‌లో విక్ర‌యాలు ప్రారంభం అవుతాయ‌ని స‌మాచారం.

టెక్నో క‌మోన్30 ప్రీమియ‌ర్ 5జీ (Tecno Camon 30 Premier 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ (Corning Gorilla Glass protection)తోపాటు 6.77-అంగుళాల 1.5కే+ (2,780 x 1,264 పిక్సెల్స్‌) ఎల్‌టీపీఓ అమోలెడ్ (LTPO AMOLED) డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్ (MediaTek Dimensity 8200 chipset)తోపాటు 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ కెపాసిటీ క‌లిగి ఉంటుంది. ఫోన్ ర్యామ్‌ను వ‌ర్చువ‌ల్‌గా అద‌నంగా 12 జీబీ పెంచుకుని 24 జీబీ ర్యామ్ వ‌ర‌కూ విస్త‌రించుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హెచ్ఐ ఓఎస్ 14 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుందీ ఫోన్‌.

టెక్నో క‌మోన్‌30 ప్రీమియ‌ర్ 5జీ (Tecno Camon 30 Premier 5G) ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తోంది. ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌) మ‌ద్ద‌తుతో 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా, 3ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్ వ‌రకూ 50-మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ కెమెరా, ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 50-మెగా పిక్సెల్ 50-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంది. ఈ సెన్స‌ర్ల‌తోపాటు క్వాడ్ ఫ్లాష్ యూనిట్ ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం ఆటోఫోక‌స్ మ‌ద్ద‌తుతో 50-మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది.

టెక్నో కామోన్30 ప్రీమియ‌ర్ 5జీ (Tecno Camon 30 Premier 5G) ఫోన్ 70వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ ఉంటుంది. ఈ ఫోన్ బ్యాట‌రీ 45 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అవుతుంది. 5జీ, 4జీ, జీఎన్ఎస్ఎస్‌, వై-ఫై, ఓటీజీ, యూఎస్బీ టైప్‌-సీ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది.

Tecno Camon 30 Premier 5G,Tecno Camon 30 Premier 5G launch,Tecno Camon 30 Premier 5G specifications,Tecno Camon 30 Series,Tecno