Telusu Kada | సిద్ధు జొన్నలగడ్డ మూవీ షూటింగ్ అప్ డేట్స్

 

2024-08-12 17:13:03.0

https://www.teluguglobal.com/h-upload/2024/08/12/1351834-telusu-kada.webp

Telusu Kada – సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా తెలుసు కదా. ప్రస్తుతం సిద్ధు, రాశీ మధ్య సాంగ్ తీస్తున్నారు.

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా ‘తెలుసు కదా’. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమౌతున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో కొంత టాకీతో పాటు, పాటలు కూడా షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై సినిమా మొదటి పాట షూట్ స్టార్ట్ చేశారు.

తమన్ స్కోర్ చేసిన ఈ సాంగ్ కు కెకె లిరిక్స్ అందించాడు. నా సామి రంగాతో దర్శకుడిగా పరిచయం అయిన విజయ్ బిన్నీ, ఈ పాటకు కొరియోగ్రాఫర్. సిద్ శ్రీరామ్ పాడిన పాట ఇది.

ఇది 30 రోజుల పాటు సాగే నాన్-స్టాప్ షెడ్యూల్. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్ గా నటిస్తుండగా, వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నాడు. సిద్దు జొన్నలగడ్డ తన పాత్ర కోసం మేకోవర్ అయ్యాడు. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్. 

 

Siddhu Jonnalagadda,Raashi Khanna,Telusu Kada,Telusu Kada Shooting