Thiragabadara Swami | రాజ్ తరుణ్ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్

 

2024-07-12 08:38:28.0

https://www.teluguglobal.com/h-upload/2024/07/12/1343698-raj-tarun.webp

Thiragabadara Swami – రాజ్ తరుణ్ కొత్త సినిమా పేరు తిరగబడరాసామీ. ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

రాజ్ తరుణ్ హీరోగా, ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా హీరోయిన్ గా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ని ఆకట్టుకునే రొమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్ట్ 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రాగా.. పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

సెన్సేషనల్ బ్యూటీ మన్నారా చోప్రా ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో పాటు ఒక స్పెషల్ సాంగ్ లో అలరించబోతుంది. మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్, రఘు బాబు, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇతర కీలక పాత్రలు పోషించారు. 

 

Raj Tarun,Thiragabadara Swami,Release Date,Malvi Malhotra