https://www.teluguglobal.com/h-upload/2023/08/22/500x300_813865-ultraviolette.webp
2023-08-22 10:19:49.0
Ultraviolette F77 | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈవీ స్టార్టప్ కంపెనీ ఆల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ స్పేస్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్ బైక్ ఎఫ్77 మార్కెట్‌లోకి తెచ్చింది.
Ultraviolette F77 | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈవీ స్టార్టప్ కంపెనీ ఆల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ స్పేస్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్ బైక్ ఎఫ్77 మార్కెట్‌లోకి తెచ్చింది. దాని ధర రూ.5.6 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. ఈ బైక్ గంటకు 152 కి.మీ వేగంతో దూసుకెళుతుందని ఆల్ట్రావయోలె్ ఆటోమోటివ్ తెలిపింది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. కేవలం 10 ఆల్ట్రా వయోలెట్ ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్‌లు మాత్రమే విక్రయిస్తామని తెలిపింది. ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో ఏ మోటారు సైకిల్‌తోనూ ఈ బైక్ నేరుగా పోటీ పడదు. ఐసీఈ బైక్ సెగ్మెంట్‌లో కేటీఎం ఆర్‌సీ 390, బీఎండబ్ల్యూ జీ310ఆర్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 బైక్‌లతో పోటీ పడుతుంది.
ఆల్ట్రా వయోలెట్ ఎఫ్77 స్పెషల్ ఎడిషన్ బైక్ 10.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఇంజిన్ గరిష్టంగా 40.5 హెచ్ఫీ విద్యుత్, 100 న్యూటన్ మీటర్ల టార్చి వెలువరిస్తుంది. కేవలం 2.9 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. గరిష్టంగా 152 కి.మీ వేగంతో దూసుకెళుతుంది. సింగిల్ చార్జింగ్‌తో 307 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. బైక్ ఫ్రంట్‌లో 320 ఎంఎం డిస్క్ బ్రేక్, రేర్‌లో 230 ఎంఎం డిస్క్ బ్రేక్ లభిస్తాయి. 17 అంగుళాల 110/70 ఆర్17 ఫ్రంట్ టైర్, 23 అంగుళాల 150/60 ఆర్23 రేర్ టైర్, 5-అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే విత్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ.. టర్న్‌బై టర్న్ నావిగేషన్, అండ్ నోటిఫికేషన్ అలర్ట్స్ ఉంటాయి.
నేషనల్ ఏరోస్పేస్ కమ్యూనిటీని గౌరవిస్తామని ఆల్ట్రావయోలెట్ ప్రకటించింది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఎయిరోస్పేస్ స్ఫూర్తిగా ఈ బైక్ డిజైన్ చేసినట్లు తెలిపింది. ఈ బైక్ విడి భాగాలు `ఎయిరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం 7075`తో తయారు చేసినట్లు పేర్కొంది. మెటల్ గరిష్ట బలం అల్యూమినియం 7075. స్టీల్ కంటే తేలిగ్గా ఉన్నా బలంగా ఉంటుంది. విమానం బాడీ, రక్షణ రంగ వ్యవస్థలు, ఎయిరో స్పేస్, మిలిటరీ పరిశ్రమల్లో అల్యూమినియం 7075 వాడతారు.
Ultraviolette F77,Ultraviolette F77 Space Edition
Ultraviolette F77, ultraviolette f77 space edition, ultraviolette f77 price in india, ultraviolette f77 top speed, ultraviolette f77 battery
https://www.teluguglobal.com//business/ultraviolette-f77-space-edition-launched-for-56-lakh-956612