UP CM యోగీ ఆదిత్యానాథ్ కు వ్యతిరేకంగా క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేసిన అంతర్జాతీయ లాయర్ల గ్రూప్

2023-01-19 08:23:12.0

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సద‌స్సుకు హాజరయ్యేందుకు సిఎం యోగి దావోస్‌కు వెళ్లిన సందర్భంగా ‘గ్వెర్నికా 37 ఛాంబర్స్’ అనే లాయర్స్ గ్రూపు స్విస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో ఈ ఫిర్యాదు దాఖలు చేసింది. జనవరి 17, మంగళవారం నాడు ఈ పిర్యాదు లాడ్జ్ అయ్యింది.

అనేక మంది మరణాలకు, అనేక మందిపై హింసలకు, అక్రమ అరెస్టులకు కారణమయ్యాడని పేర్కొంటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ పై అంతర్జాతీయ ల్శాయర్ల బృందం క్రిమినల్ కంప్లైంట్ ను లాడ్జ్ చేసింది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సద‌స్సుకు హాజరయ్యేందుకు సిఎం యోగి దావోస్‌కు వెళ్లిన సందర్భంగా ‘గ్వెర్నికా 37 ఛాంబర్స్’ అనే లాయర్స్ గ్రూపు స్విస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో ఈ ఫిర్యాదు దాఖలు చేసింది. జనవరి 17, మంగళవారం నాడు ఈ పిర్యాదు లాడ్జ్ అయ్యింది.

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) వ్యతిరేకిస్తూ యూపీలో జరిగిన నిరసన ప్రదర్శనలపై యోగీ ప్రభుత్వం తీవ్రమైన దమనకాండ కొనసాగించిందని లాయర్ల బృందం తమ పిటిషన్ లో పేర్కొన్నారు.

గ్వెర్నికా 37 ఛాంబర్స్ ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది, “పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలను అణిచివేసేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ 2019, జనవరి 2020 మధ్యకాలంలో పౌరులపై తప్పుడు కేసులు పెట్టి జైలులో ఉంచడం, హింసించడం, హత్య చేయడం వంటివి జరిగాయని, ఇవన్నీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలమేరకే జరిగాయని పేర్కొంది.

ఈ చర్యలు మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరాలుగా పరిగణించబడతాయని పేర్కొన్న‌ క్రిమినల్ రిపోర్ట్, పౌరులపై, ముఖ్యంగా ముస్లిం జనాభాపై క్రమబద్ధమైన దాడి జరిగినట్లు ఆరోపించింది.

ఈ హింస జరగడానికి ముఖ్యమంత్రి యోగితో సహా యుపి ప్రభుత్వంలోని సీనియర్ సభ్యులు యుపి పోలీసులకు ఆదేశాలిచ్చినట్టు తగిన ఆధారాలున్నాయని ‘గ్వెర్నికా 37 ఛాంబర్స్’ పేర్కొంది. డిసెంబరు 19, 2019న నిరసనకారులపై పగ తీర్చుకోవాలని పోలీసులకు పిలుపునిస్తూ యోగి చేసిన‌ ఒక ప్రసంగం తర్వాత‌ పోలీసు హింస తీవ్రతరం అయ్యిందని, భారత దేశం నుండి యోగి అధికారికంగా వచ్చినప్పటికీ ఆయన చేసిన ఈ నేరాలకు దౌత్యపరమైన మినహాయింపును పొందలేరు ” అని ప్రకటన పేర్కొంది.

”డిసెంబర్ 2019లో పౌరసత్వ (సవరణ) చట్టం ఆమోదించబడిన తర్వాత, చాలా మంది వ్యక్తులు, ముఖ్యంగా ముస్లిం సమాజానికి చెందిన వారు శాంతియుత నిరసనలు చేస్తూ వీధుల్లోకి వచ్చారు. వీరిలో పలువురిని పోలీసులు అరెస్టు చేసి దాడి చేశారు. యుపి పోలీసులు 22 మంది నిరసనకారులను చంపారని, కనీసం 117 మందిని హింసించారని, 307 మందిని ఏకపక్షంగా నిర్బంధించారని నివేదించబడింది” అని గ్వెర్నికా 37 ఛాంబర్స్ పేర్కొంది.

క్రిమినల్ రిపోర్ట్‌లోని విషయాలు, బాధితులు, ఫిర్యాదుదారులు, పిటిషనర్ల వివరాలు వారి భద్రత రీత్యా గోప్యంగా ఉంచుతున్నామని ‘గ్వెర్నికా 37 గ్రూప్’ వ్యవస్థాపకుడు,G37 ఛాంబర్స్ జాయింట్ హెడ్ టోబీ కాడ్‌మాన్ తెలిపారు.

స్విస్ క్రిమినల్ కోడ్ ఆర్టికల్ 264 (జాతిహననం, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు) ప్రకారం ఈ క్రిమినల్ పిర్యాదు దాఖలు చేశారు.

group,international lawyers criminal complaint,UP CM,Yogi Adityanath,Uttar Pradesh