Vakeel Saab | వకీల్ సాబ్ కు అనూహ్య స్పందన

 

2024-05-02 17:33:51.0

https://www.teluguglobal.com/h-upload/old_images/112989-vakeel-saab-pawan.webp

Pawan Kalyan’s Vakeel Saab – మే డే కానుకగా థియేటర్లలోకి వచ్చింది వకీల్ సాబ్. రీ-రిలీజ్ లో కూడా హిట్టయింది.

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ రీ-రిలీజ్ కు అనూహ్య స్పందన వచ్చింది. మే డే కానుకగా మరోసారి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పవన్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాను థియేటర్లలో సెలబ్రేట్ చేస్తున్నారు అభిమానులు.

ఈ రీ-రిలీజ్ కు ఇంత స్పందన రావడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఇది పవన్ కల్యాణ్ కు కమ్ బ్యాక్ మూవీ. ఇక సినిమాలు చేయడేమో అనుకుంటున్న టైమ్ లో వకీల్ సాబ్ సినిమా చేశాడు పవన్. అప్పట్లో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ, దాన్ని సైతం లెక్కచేయకుండా థియేటర్లలో పవన్ సినిమాను చూశారు చాలామంది.

అలాంటి మూవీ మరోసారి రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవ్. పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలనే దిల్ రాజు కోరిక, వకీల్ సాబ్ తో నెరవేరింది. వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకుడు. బాలీవుడ్, కోలీవుడ్ లో సూపర్ హిట్టయిన పింక్ సినిమాకు రీమేక్ గా వకీల్ సాబ్ వచ్చింది.

పవన్ ఇమేజ్ కు తగ్గట్టు తెలుగు వెర్షన్ కు మంచి మార్పులు చేశాడు దర్శకుడు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అనన్య నాగళ్ల, అంజలి, నివేత థామస్ కీలక పాత్రలు పోషించారు. 

 

Pawan Kalyan,vakeel saab,re-release,Shruti Haasan