Varun Sandesh | ది కానిస్టేబుల్ షూటింగ్ అప్ డేట్స్

 

2024-06-20 17:25:38.0

https://www.teluguglobal.com/h-upload/2024/06/20/1338144-varun-sandesh-constable-1.webp

Varun Sandesh – నింద సినిమాను విడుదలకు సిద్ధం చేసిన వరుణ్ సందేశ్.. కానిస్టేబుల్ అనే మరో సినిమాను కూడా కొలిక్కి తీసుకొచ్చాడు.

వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “ది కానిస్టేబుల్”. వరుణ్ సందేశ్ కి జోడిగా మధులిక వారణాసి హీరోయిన్ గా పరిచయమౌతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. హైదరాబాద్ లో చేసిన షెడ్యూల్ తో సినిమా షూట్ మొత్తం కంప్లీట్ అయింది.

ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, “సినిమా షూటింగ్ అంతా చాలా హాయిగా సాగింది. త్వరలో కానిస్టేబుల్ పాత్ర లో కొత్త కోణంలో, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను” అని చెప్పారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో వరుణ్ సందేశ్ నట విశ్వరూపం చూడవచ్చంటున్నారు మేకర్స్. త్వరలో ఈ చిత్రం పాటలను, మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తామని అన్నారు.

 

Varun Sandesh,The Constable,shooting updates