2024-07-06 17:35:02.0
https://www.teluguglobal.com/h-upload/2024/05/20/1329226-vijay-antony-toofan.webp
Vijay ANTONY – నటుడిగా ఫుల్ బిజీగా ఉన్న విజయ్ ఆంటోనీ, సంగీతంపై దృష్టి సారించాడు. లైవ్ ప్రదర్శన ఇస్తానంటున్నాడు.
విజయ్ ఆంటోనీ నటుడిగా అందరికీ తెలుసు. కానీ నటుడిగా ఎదగడానికంటే ముందు అతడు మ్యూజిక్ కంపోజర్, అంతకంటే ముందు అతడు ఎడిటర్. ఇప్పటికీ తన సినిమాల్లో చాలావాటికి అతడే స్వయంగా సంగీతం అందిస్తుంటాడు.
అయితే విజయ్ ఆంటోనీలోని సంగీత దర్శకుడ్ని పూర్తిస్థాయిలో ఎలివేట్ చేసిన సినిమా ఈమధ్య కాలంలో రాలేదు. ఎందుకంటే, అతడు యాక్షన్ పైనే పూర్తిగా దృష్టిపెట్టాడు. ఇదే విషయాన్ని ఆయన గతంలో పలుమార్లు ప్రస్తావించాడు కూడా. బిజీ షెడ్యూల్స్ వల్ల సంగీతంపై ఫోకస్ పెట్టలేకపోతున్నానని, ఎడిటింగ్ ను పూర్తిగా వదిలేశానని కూడా అన్నాడు.
ఎట్టకేలకు ఈ నటుడు, తనకు లైఫ్ ఇచ్చిన సంగీతంపై ఫోకస్ పెడుతున్నాడు. అది కూడా నేరుగా లైవ్ కాన్సర్ట్ ఇవ్వబోతున్నాడు. అవును.. తను త్వరలోనే సంగీత ప్రదర్శన ఇస్తానని ప్రకటించాడు విజయ్ దేవరకొండ. అది కూడా హైదరాబాద్ లో కావడం విశేషం.
తన కొత్త సినిమా తూఫాన్ ప్రచారం కోసం, హీరోయిన్ మేఘా ఆకాష్ తో కలిసి హైదరాబాద్ వచ్చాడు విజయ్ ఆంటోనీ, ఈ సందర్భంగా ఈ ప్రకటన చేశాడు. విజయ్ ఆంటోనీని త్వరలోనే స్టేజ్ పై సంగీత దర్శకుడిగా చూడబోతున్నారు జనం.
Vijay ANTONY,Musical Live Concert,Hyderabad,Vijay ANTONY Music