Vijay Deverakonda | అమెరికా టూర్ సక్సెస్

 

2024-06-11 17:35:40.0

https://www.teluguglobal.com/h-upload/2024/06/11/1335481-vijay-deverakonda.webp

Vijay Deverakonda USA Tour – ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నాడు హీరో విజయ్ దేవరకొండ. అతడి టూర్ సక్సెస్ అయింది.

హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి అమెరికా టూర్ లో ఉన్నాడు. ఈ పర్యటనకు విజయ్ తండ్రి గోవర్థన్, తల్లి మాధవి, సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా వెళ్లారు. విజయ్ దేవరకొండ యూఎస్ టూర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు రావడం పట్ల అక్కడి తెలుగువారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ను కలిసేందుకు, ఆయనతో కలిసి ఫొటోస్ తీసుకునేందుకు తెలుగువారు పోటీపడ్డారు. ఆమెరికాలో విజయ్ దేవరకొండ క్రేజ్ కు ఈ టూర్ నిదర్శనం.

అమెరికా తెలుగు ఆసోసియేషన్ (ఆటా) ఏర్పాటు చేసిన ఈవెంట్ గెస్ట్ గా పాల్గొన్నాడు విజయ్ దేవరకొండ. శ్రీముఖి ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించింది. ఆ తర్వాత విమెన్ ఆర్గనైజేషన్ మీటింగ్ కు కూడా విజయ్ దేవరకొండ అతిథిగా వెళ్లాడు.

“మన తెలుగువారు చదువుల కోసం, ఉద్యోగాల కోసం యూఎస్ వచ్చారు. ప్రస్తుతం రెసిషన్ టైమ్ నడుస్తోంది. మీరంతా స్ట్రాంగ్ గా ఉండండి. మళ్లీ మంచి రోజులు వస్తాయి. తమ పిల్లల కోసం అమెరికా వచ్చిన అత్తమ్మలు, మామయ్యలకు కూడా హాయ్ చెబుతున్నా.” అంటూ స్పందించాడు విజయ్ దేవరకొండ. 

 

Vijay Deverakonda,america tour,Anand Deverakonda