Vijay Deverakonda | కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ

 

2024-05-09 17:33:52.0

https://www.teluguglobal.com/h-upload/2024/05/09/1326365-vijay-deverakonda-1.webp

Vijay Deverakonda – విజయ్ దేవరకొండ మరో సినిమా ప్రకటించాడు. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తో సినిమా చేయబోతున్నాడు.

హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతోంది. కెరీర్ లో విజయ్ దేవరకొండకు ఇది 14వ చిత్రం. ఇవాళ విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. అది ఆసక్తికరంగా ఉంది.

బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై చెక్కిన వీరుడి విగ్రహం ఉంది. దాని మీద ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ అని రాసి ఉంది. ఆయన జీవిత కాలం 1854 నుంచి 1878గా పేర్కొన్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ వంటి సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. ‘టాక్సీవాలా’ లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు.

 

Vijay Deverakonda,Rahul Sankrityan,Taxiwala,Mythri movie makers