Vijay sethupathi | భయమేసిందన్న విజయ్ సేతుపతి

 

2024-06-17 16:54:39.0

https://www.teluguglobal.com/h-upload/2024/06/17/1337308-maharaja-1.webp

Vijay Sethupathi – విజయ్ సేతుపతి 50వ చిత్రం మహారాజా. ఈ సినిమా తెలుగులో కూడా సక్సెస్ అయింది.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లేటెస్ట్ మాస్టర్ పీస్ ‘మహారాజ’. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఎన్‌విఆర్ సినిమా ఈ మూవీని ఏపీ, తెలంగాణలలో రిలీజ్ చేసింది.

విజయ్ సేతుపతి 50వ సినిమాగా జూన్ 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. సినిమా స్క్రీన్ ప్లేకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ థాంక్ యూ మీట్ నిర్వహించింది. థాంక్ యూ మీట్ లో హీరో విజయ్ సేతుపతి మాట్లాడాడు.

“మీ అందరి ప్రేమ అభిమానం చూసి కొంచెం భయం వేసింది. మహారాజకి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్నిచ్చింది. మీరు చూపిన ప్రేమ చూస్తుంటే.. ఇది నా హోమ్ టౌన్ లానే అనిపిస్తోంది. ఇంత కంఫర్ట్ ఇచ్చిన ఆడియన్స్ కి మీడియాకి అందరికీ చాలా థ్యాంక్స్.

ఈ సినిమా తెలుగు-తమిళ భాషల్లో హిట్టయింది. మూవీలో విజయ్ సేతుపతి యాక్టింగ్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.

 

Vijay Sethupathi,Maharaja Movie,Telugu Dubbing,Thanks Meet