Vikram | తంగలాన్ ప్రపంచ సినిమా

 

2024-08-14 16:54:44.0

https://www.teluguglobal.com/h-upload/2024/08/05/1349774-vikram.webp

Vikram Thangalaan Movie – తంగలాన్ సినిమా తన కెరీర్ లోనే ఎంతో ప్రత్యేకమైన సినిమా అంటున్నాడు హీరో విక్రమ్.

తమిళ నటుడు చియాన్ విక్రమ్ నటించిన శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి చిత్రాలెన్నో నటుడిగా, స్టార్ హీరోగా ఆయన ప్రత్యేకతను చూపించాయి. ఆయన ఇప్పుడు “తంగలాన్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించారు.

నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది “తంగలాన్”. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో విక్రమ్ ప్రత్యేకంగా మాట్లాడాడు.

“తంగలాన్ తెలుగు, తమిళ, కన్నడ అని కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యే స్టోరీ. ఇది ప్రపంచ సినిమా. బంగారం వేట అనేది హైలైట్ అవుతున్నా..ఈ కథలో స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ఉంది. ఇది ఒక వర్గానికి ఆపాదించలేం. మన జీవితాల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు అసమానతలకు గురవుతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ సినిమా.”

తంగలాన్ కథ అందర్నీ ఆకట్టుకుంటుందంటున్నాడు విక్రమ్. ఎవరినీ ఇబ్బంది పెట్టే పేర్లు, మాటలు ఈ సినిమాలో ఉండవని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నాడు. తంగలాన్ అనేది ఓ తెగ పేరు.

 

Vikram,Thangalaan Movie,PA Ranjith,Malavika Mohanan