2024-07-29 09:17:27.0
Vivo Y18i | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వై18ఐ (Vivo Y18i) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Vivo Y18i | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వై18ఐ (Vivo Y18i) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రెండు కలర్ ఆప్షన్లలో వస్తున్న వివో వై18ఐ (Vivo Y18i) ఫోన్ 6.56 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్న ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీతోపాటు యూనిసోక్ టీ612 (Unisoc T612) ప్రాసెసర్‌తో వస్తోంది. 13-మెగా పిక్సెల్ మెయిన్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో అందుబాటులో ఉంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది వివో వై18ఐ ఫోన్. ఈ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ వివో.. తన వివో వై18ఐ ఫోన్ ఆవిష్కరణపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
వివో వై18ఐ (Vivo Y18i) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,999లకు లభిస్తుంది. జెమ్ గ్రీన్ (Gem Green), స్పేస్ బ్లాక్ (Space Black) కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దేశంలోని రిటైల్ స్టోర్లలో లభిస్తోంది.
వివో వై18ఐ (Vivo Y18i) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ (Android 14) ఫన్‌టచ్ ఓఎస్ 14 (Funtouch OS 14) వర్షన్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ 6.56- అంగుళాల హెచ్‌డీ+ (1,612 × 720 పిక్సెల్స్) ఎల్‌సీడీ డిస్‌ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ర్యామ్ వర్చువల్గా 8జీబీ వరకూ పొడిగించుకోవచ్చు.
వివో వై18ఐ (Vivo Y18i) ఫోన్ రేర్ ఫ్లాష్‌తో డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. 13-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 0.08- మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటాయి. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 64 జీబీ స్టోరేజీ కెపాసిటీని పెంచుకోవచ్చు.
వివో వై18ఐ (Vivo Y18i) ఫోన్ వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, బైదూ, గ్లోనాస్, గెలీలియో, క్యూజడ్ఎస్ఎస్, ఓటీజీ, ఎఫ్ఎం రేడియో, యూఎస్బీ 2.0 పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, ప్రాగ్జిమిటి సెన్సర్ ఉంటాయి. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ-64 రేటింగ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
Vivo Y18i,Vivo,Smartphone,Vivo Y18i Price