Vivo Y200 5G | వివో వై200 5జీ ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు.. ఇవీ డిటైల్స్‌..!

https://www.teluguglobal.com/h-upload/2023/10/17/500x300_842012-vivo-y200.webp

2023-10-17 09:10:39.0

Vivo Y200 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో (Vivo) భార‌త్ మార్కెట్లోకి వివో వై200 5జీ (Vivo Y200 5G) ఫోన్ ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు చేసింది.

Vivo Y200 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో (Vivo) భార‌త్ మార్కెట్లోకి వివో వై200 5జీ (Vivo Y200 5G) ఫోన్ ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు చేసింది. ఈ నెల 23వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు భార‌త్ మార్కెట్లో వివో వై200 5జీ (Vivo Y200 5G) ఫోన్ ఆవిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో వివో వై200 5జీ ఫోన్ వ‌స్తుంది. డ‌స‌ర్ట్ గోల్డ్‌, జంగిల్ గ్రీన్ క‌ల‌ర్స్‌లో ల‌భిస్తుంది. వివో వీ29, వివో వీ29 ప్రో మోడ‌ల్ ఫోన్ల‌లో మాదిరిగా ఔరా లైట్ ఫీచ‌ర్ (Aura Light feature) కూడా ఉంటుంద‌ని చెబుతున్నారు. రెక్టాంగుల‌ర్ కెమెరా మాడ్యూల్‌తో వ‌స్తుంది. దీని ధ‌ర భార‌త్ మార్కెట్‌లో రూ.24 వేల లోపే ఉండొచ్చున‌ని భావిస్తున్నారు.

వివో వై200 5జీ స్మార్ట్ ఫోన్‌.. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ కెపాసిటీతో వ‌స్తుంద‌ని చెబుతున్నారు. వ‌ర్చువ‌ల్‌గా ర్యామ్ మ‌రో 8జీబీ పెంచుకోవ‌చ్చు. 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (2400 x 1,080 పిక్సెల్స్‌) అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఉండొచ్చున‌ని అంచ‌నా వేస్తున్నారు. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 4 జెన్ 1 ఎస్వోసీ చిప్‌సెట్ క‌లిగి ఉండే వివో వై200 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ -13 బేస్డ్ ఫ‌న్‌ట‌చ్ ఔటాఫ్ బాక్స్ వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది.

వివో వై200 5జీ ఫోన్ 64-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ విత్ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్‌, 2-మెగా పిక్సెల్ సెకండ‌రీ సెన్స‌ర్‌, 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది. 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 4800 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుందీ ఫోన్‌.

Vivo Y200,5G,Smartphone,vivo

https://www.teluguglobal.com//science-tech/vivo-y200-5g-india-launch-date-set-for-october-23-colour-options-teased-968312