2024-05-01 08:51:20.0
https://www.teluguglobal.com/h-upload/2024/05/01/1323830-weekend.webp
Weekend Release – ఈ వారాంతం 4 సినిమాలొస్తున్నాయి. ఇవన్నీ వేటికవే భిన్నమైనవి.
ఈ వీకెండ్ రిలీజ్ ల హంగామా ఆల్రెడీ మొదలైంది. మే డే కావడంతో ఇవాళ్టి నుంచి సినిమాలు థియేటర్లలోకి రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈరోజు వకీల్ సాబ్, ప్రేమికుడు సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. ఇక శుక్రవారం రోజున 4 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
వీటిలో ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్టు ఆ ఒక్కటి అడక్కు. లాంగ్ గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ చేస్తున్న కామెడీ సినిమా ఇది. పైగా క్లాసిక్ టైటిల్ తో వస్తోంది. అల్లరి నరేష్ ఆ టైటిల్ పరువు కాపాడతాడా లేదా అనేది చూడాలి. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ అందిస్తుందని చెబుతున్నారు.
కామెడీ సినిమాతో పాటు హారర్ రెడీ అయింది. రాశిఖన్నా, తమన్న హీరోయిన్లుగా నటించిన బాక్ సినిమా శుక్రవారం వస్తోంది. సి.సుందర్ హీరోగా నటించడంతో పాటు, స్వయంగా దర్శకత్వం వహించిన సినిమా ఇది. సుందర్ భార్య ఖుష్బూ ఈ సినిమాకు నిర్మాత.
ఇక సుహాస్ హీరోగా థ్రిల్లర్ మూవీ ప్రసన్న వదనం వస్తోంది. కలర్ బ్లయిండ్ నెస్ తో వస్తున్న ఈ సినిమా ట్రయిలర్ తో ఆకట్టుకుంటోంది. అటు వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన యాక్షన్ డ్రామా శబరి కూడా రిలీజ్ కు రెడీ అయింది. ఇలా కామెడీ, హారర్, థ్రిల్లర్, యాక్షన్ జానర్ సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వస్తున్నాయి.
Weekend Release,4 Different Movies,Aa Okkati Adakku,Prasanna Vadanam,Sabari,Baak