World Kidney day 2024: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

https://www.teluguglobal.com/h-upload/2024/03/14/500x300_1306333-world-kidney-day.webp
2024-03-14 06:18:35.0

మన శరీరంలోని కీలకమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలోని వ్యర్థాలు, మలినాలు, విష పదార్థాలను వడకట్టి మరీ బయటకు పంపుతాయి కిడ్నీలు.

మన శరీరంలోని కీలకమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలోని వ్యర్థాలు, మలినాలు, విష పదార్థాలను వడకట్టి మరీ బయటకు పంపుతాయి కిడ్నీలు. ఇవి మన శరీరంలోని సహజ ఫిల్టర్లు. ఊబకాయం, అధిక రక్తపోటు, కొలెస్టరాల్‌, గుండె సంబంధ వ్యాధుల వంటి అనారోగ్యాల బారినపడకుండా ఉండేందుకు నిపుణులు ఇచ్చే ఎన్నో సూచనలు, సలహాలు చాలామంది వింటారు, పాటిస్తారు కూడా .అయితే, కిడ్నీలను కాపాడుకోవడం కూడా ఈ రోజుల్లో చాలా ముఖ్యం. మూత్ర పిండాలు పాడయ్యాయంటే శరీరంలో ఇన్ ఫెక్షన్ల శాతం పెరుగుతూ ఉంటాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. సరైన ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం కొన్నింటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇంకొన్నింటికి తప్పక తీసుకోవాలి . అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కిడ్నీల కోసం ఎక్కువ శాఖాహారాన్ని, తక్కువ ఉప్పు తింటూ ఉండాలి. ఆపిల్, బెర్రీలు, క్యాబేజీ వంటివి అధికంగా తినాలి. సోయా, పప్పుధాన్యాలు, కాటేజ్ చీజ్ వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్లను తింటే ఎంతో మంచిది. బ్రౌన్ రైస్, క్వినోవా వంటి తృణధాన్యాలు తరచూ తింటూ ఉండాలి. ఆలివ్ ఆయిల్, ఆవ నూనె, సోయాబీన్ ఆయిల్ వంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. చాలా పండ్లలో సహజంగా సోడియం, పొటాషియం తక్కువగా ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవన్నీ మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఆకుకూరలు కొవ్వు తీసిన పాలను, పెరుగు, చీజ్ వంటివి తింటూ ఉండాలి. బ్రౌన్ రైస్, ఓట్స్‌లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.

ఇక కిడ్నీ ఆరోగ్యానికి తినకూడని పదార్ధాలు ఏంటంటే..

ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే జంక్ ఫుడ్‌ని కూడా ఇవి ఎక్కువ ఉప్పును కలిగి ఉంటాయి. అరటి పండ్లు, పుల్లని పండ్లు, బంగాళాదుంపలు, అవకాడోలు వంటివి కూడా మంచిది కాదు. ఊరగాయలు, నిల్వ పచ్చళ్లు వంటి వాటిలో కూడా సోడియం అధికంగా ఉంటుంది. చక్కెర నిండిన పానీయాలు తినకూడదు. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలను తినడం తగ్గించాలి. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు ఫాస్పరస్ తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పాల ఉత్పత్తులు, ఎర్ర మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఫాస్పరస్ ఉంటుంది. పొటాషియం మరొక ముఖ్యమైన పోషకం, కానీ మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు దీన్ని తక్కువగా తీసుకోవాలి. పొటాషియం అధికంగా ఉండే ఆహారాలలో అరటిపండ్లు, నారింజ, బంగాళాదుంపలు, టమోటాలు ముఖ్యమైనవి. ఈ ఆహారాలు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. అలాగే కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశాన్ని పెంచుతాయి.

World Kidney Day,World Kidney Day 2024,Health Tips,Kidney Health,Kidney
World Kidney Day, World Kidney Day 2024, Heakth, Kidney, Kidney health, Kidney food, Kidney problems

https://www.teluguglobal.com//health-life-style/world-kidney-day-2024-how-to-keep-the-kidneys-healthy-you-have-to-take-these-precautions-1010554