XXX సబ్బుల కంపెనీ అధినేత మృతి

2025-03-13 14:33:33.0

ప్రముఖ XXX సబ్బుల కంపెనీ అధినేత మాణిక్కవేల్ అరుణాచలం మరణించారు.

ప్రముఖ XXX సబ్బుల కంపెనీ అధినేత మాణిక్కవేల్ అరుణాచలం మరణించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరు అరండల్ పేటలోని స్వగృహంలో ఇవాళ మృతి చెందారు. తమిళనాడుకు చెందిన మాణిక్కవేల్ అరుణాచలం ఏపీలోని గుంటూరు జిల్లాలో స్థిరపడ్డారు. ఇక్కడి నుంచే సోప్‌ల బిజినేస్ మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. రేపు ఉదయం ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో XXX సోప్, ఈ బ్రాండ్ ఇతర ఉత్పత్తుల ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Manikkavel Arunachalam,XXX Soap,Guntur District,Tamil Nadu,CM Chandrababu,Naralokesh,TDP,Crime news